
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా అద్భుతమైన ఫ్యాన్స్ ఆర్మీని కలిగి ఉంది. ఐపీఎల్‌లో ఈ జట్టు గెలవకపోయినా అభిమానులు మాత్రం ఈ జట్టును వీడలేదు. విరాట్ కోహ్లీ అభిమానులందరూ RCBకి తోడుగా నిలిచారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఈ జట్టుకు కెప్టెన్ కానప్పటికీ, అభిమానుల ప్రేమ ఈ ఫ్రాంచైజీపై చెక్కుచెదరలేదు. మార్చి 12 న RCB తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. (PC-AFP)

ఈ మేరకు RCB మంగళవారం ట్వీట్ చేసింది. మార్చి 12 న కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నట్లు పేర్కొంది. ఆ రోజే విరాట్ కోహ్లీ వారసుడు ఎవరనేది తెలియనుంది. టోర్నమెంట్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. ఈ రేసులో ఫాఫ్ డు ప్లెసిస్ ముందంజలో ఉన్నాడు. చాలా మంది దినేష్ కార్తీక్ పేరు కూడా ఈ లిస్టులో ఉందనే వార్తలు వచ్చాయి. (PC-AFP)

కెప్టెన్ పేరు ప్రకటనతోపాటు మార్చి 12 న, RCB కొత్త పేరు, కొత్త జెర్సీని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరును మార్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. జట్టు పేరు మారితే RCB జెర్సీ కూడా మారవచ్చని తెలుస్తోంది. (PC-IPL)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త పాత్రలో ఏబీ డివిలియర్స్‌ను జట్టులోకి తీసుకోవచ్చని కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. డివిలియర్స్ గతేడాది క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాడు. అతను జట్టులో మెంటార్‌గా చేరనున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ నివేదికలపై ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం లేదు. (PC-IPL)

RCB జట్టు తన మొదటి IPL మ్యాచ్‌ని మార్చి 27న ఆడనుంది. బెంగళూరు తొలి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో జరగనుంది. కాగా, మార్చి 12న ఆర్‌సీబీ సారథిపై నెలకొన్న ఊహాగానాలకు చెక్ పడనున్నట్లు తెలుస్తోంది. (RCB ట్విట్టర్)