World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌నకు ముందే మొదలైన టెన్షన్.. గాయాలతో 11 మంది ఔట్.. లిస్టులో అగ్రస్థానం ఆ జట్టుదే?

|

Sep 16, 2023 | 10:02 PM

ICC ODI World Cup 2023: ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ఈ ఆటగాళ్లు ప్రపంచకప్‌నకు ముందు కోలుకుంటేనే మళ్లీ జట్టులో కనిపించగలరు. వివిధ జట్లకు చెందిన మొత్తం 11 మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. దీంతో అన్ని జట్లకు వరల్డ్ కప్‌నకు ముందు టెన్షన్ మొదలైంది. కాగా, గాయపడిన ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1 / 13
వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మిగిలే ఉన్నాయి. అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ముందు కొన్ని జట్లకు టెన్షన్ పట్టుకుంది. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయపడడంతో సరికొత్త తలనొప్పి మొదలైంది.

2 / 13
ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న ఈ ఆటగాళ్లు ప్రపంచకప్‌లోపు కోలుకుంటేనే మళ్లీ జట్టుతో వన్డే ప్రపంచ కప్ ప్రయాణం సాగించగలరు. లేదంటే టీం నుంచి తప్పుకోవాల్సిందే. గాయపడిన ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

3 / 13
1- ట్రావిస్ హెడ్: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. ట్రావిస్ ఎడమ చేతికి ఫ్రాక్చర్ కావడంతో ప్రపంచకప్‌లో పాల్గొనడం అనుమానంగా ఉంది.

4 / 13
2- స్టీవ్ స్మిత్: ఎడమ మణికట్టు గాయం కారణంగా స్టీవ్ స్మిత్ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరిగే సిరీస్‌లో కనిపిస్తేనే వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడు. లేదంటే ఆసీస్ జట్టుకు కష్టాలు మొదలైనట్లే.

5 / 13
3- మిచెల్ స్టార్క్: యాషెస్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భుజం గాయం, గజ్జల్లో సమస్య కారణంగా స్టార్క్ కూడా ఔట్ అయ్యాడు.

6 / 13
4- టిమ్ సౌథీ: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో, చివరి వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు టిమ్ సౌథీ కుడి బొటన వేలికి విరిగింది. కాబట్టి సౌథీ వన్డే ప్రపంచకప్‌లో కూడా కనిపించడం అనుమానమే.

7 / 13
5- మహిష్ తీక్షణ: స్నాయువు సమస్య కారణంగా శ్రీలంక స్పిన్నర్ మహిష్ థిక్షన్ ఆసియా కప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. మరో రెండు వారాల్లో పూర్తిగా కోలుకుంటేనే వన్డే ప్రపంచకప్‌లో తీక్షణ ఆడనున్నాడు.

8 / 13
6- దుష్మంత చమీర: లంక ప్రీమియర్ లీగ్‌లో శ్రీలంక పేసర్ దుష్మంత చమీర భుజం గాయంతో బాధపడ్డాడు. దీంతో ఈసారి ఆసియా కప్‌నకు దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్‌లోపు కోలుకుంటేనే లంక జట్టులో కనిపిస్తాడు.

9 / 13
7- వానిందు హసరంగా: గాయం కారణంగా ఆసియా కప్‌నకు దూరమైన శ్రీలంక ఆల్‌రౌండర్ వన్డే ప్రపంచకప్‌నకు ముందు కోలుకుంటానని నమ్మకంగా ఉంది. అంటే అక్టోబర్ 5లోగా పూర్తి ఫిట్ నెస్ సాధిస్తేనే వన్డే ప్రపంచకప్‌లో కనిపిస్తాడు.

10 / 13
8- నసీమ్ షా: ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా భుజానికి గాయమైన పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా వన్డే ప్రపంచకప్‌కు దూరం కావడం దాదాపు ఖాయమైంది.

11 / 13
9- హారిస్ రవూఫ్: పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ కండరాల నొప్పుల సమస్యతో బాధపడుతున్నాడు. అయితే, వన్డే ప్రపంచకప్‌లోపు అతడు కోలుకుంటాడని పాక్ జట్టు విశ్వాసం వ్యక్తం చేసింది.

12 / 13
10- హెన్రిక్: వెన్నెముక సమస్య కారణంగా దక్షిణాఫ్రికా పేసర్ హెన్రిక్ ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే దూరమయ్యాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తేనే ప్రపంచకప్ జట్టులో కనిపిస్తాడు.

13 / 13
11- అక్షర్ పటేల్: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అక్షర్ గాయపడడంతో వాషింగ్టన్ సుందర్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. అంటే ప్రపంచకప్‌నకు ముందు అక్షర్ పటేల్ ఫిట్‌నెస్ సాధించడంలో విఫలమైతే.. భారత జట్టుకు దూరమైనట్లే అని చెప్పవచ్చు.