- Telugu News Photo Gallery Cricket photos Indian captain rohit sharma may break 5 records in continental event asai cup 2023
Asia Cup 2023: ఆసియా కప్‌లో 5 రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ.. అవేంటంటే?
Rohit Sharma Records: ఆసియా కప్ 2023 ఇఫ్పటికే ప్రారంభమైనా.. ఈ ఖండాంతర టోర్నమెంట్‌ను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో అసలు మజా సంతరించుకోనంది. నేడు అంటే సెప్టెంబర్ 2న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు.
Updated on: Sep 02, 2023 | 7:45 AM

ఆసియా కప్ 2023 సంబరాలు ప్రారంభమైనప్పటికీ, ఈ ఖండాంతర టోర్నమెంట్‌కు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌తోనే అసలు మజా అందనుంది. సెప్టెంబర్ 2న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు.

ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు: ప్రస్తుతం రోహిత్ శర్మ ఆసియా కప్‌లో 22 వన్డేల్లో మొత్తం 745 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 971 పరుగుల రికార్డును బద్దలు కొట్టేందుకు రోహిత్‌కి ఇప్పుడు మరో 227 పరుగులు కావాలి. ఈ మైలురాయిని సాధిస్తే భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించనున్నాడు.

అత్యధిక ODI ఆసియా కప్ విజయాలు: 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో, మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో ఉన్న జట్టు అత్యధికంగా 2 ODI ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో 2018 ఆసియా కప్‌ను కూడా భారత్ గెలుచుకుంది. మరో వన్డే ఆసియా కప్‌ను గెలుచుకోవడం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సమం చేస్తాడు.

పాంటింగ్ రికార్డు: రోహిత్ శర్మ ఇప్పటివరకు 244 వన్డేల్లో 30 సెంచరీలు చేశాడు. మరో వన్డే సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్ శర్మ రికీ పాంటింగ్‌ను అధిగమించి అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో నిలుస్తాడు.

10,000 పరుగుల క్లబ్: ఆసియా కప్‌లో మరో 163 పరుగులు చేయడం ద్వారా వన్డే చరిత్రలో 10,000 పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ 244 వన్డేల్లో మొత్తం 9837 పరుగులు చేశాడు.

ఆసియా కప్‌లో అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా రికార్డు: రోహిత్ శర్మ ఆసియా కప్‌లో ఇప్పటివరకు మొత్తం 22 వన్డేలు ఆడాడు. శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే 28 మ్యాచ్‌లతో ఆసియా కప్‌లో అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఆసియాకప్‌లో మరో 6 మ్యాచ్‌లు ఆడడం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సరిచేయగలడు.

భారత ప్రాబబుల్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.





























