T20 World Cup: 2010లో ఓటమికి 2024లో ప్రతీకారం.. పాక్‌కు ఓటమి రుచి చూపించిన సౌరభ్ నేత్రవాల్కర్ ఎవరో తెలుసా?

|

Jun 07, 2024 | 9:09 PM

Saurabh Netravalkar: తమ మొదటి మ్యాచ్‌లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ USA వంటి బలహీన జట్టుపై ఓటమిని చవిచూసింది. సూపర్ ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికా విజయంలో ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ కీలక సహకారం అందించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరభ్ అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించి 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఓవర్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

1 / 6
బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో అమెరికా వంటి బలహీన జట్టుపై ఓడిపోయింది. సూపర్ ఓవర్ వరకు జరిగిన ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో యుఎస్ఏ విజయంలో ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ సహకారం కీలకమైంది.

2 / 6
పాకిస్థాన్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి అమెరికాకు విజయాన్ని అందించిన సౌరభ్ నేత్రవాల్కర్ భారత సంతతికి చెందినవాడంటే నమ్ముతారా? అవును, సౌరభ్ 16 అక్టోబర్ 1991న ముంబైలో జన్మించాడు.

3 / 6
సౌరభ్ నేత్రవాల్కర్ టీమ్ ఇండియా తరపున దేశవాళీ క్రికెట్‌లో చాలా కాలం ఆడాడు. 2010లో అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున కూడా ఆడాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ వంటి ఆటగాళ్లు సౌరభ్ మాజీ సహచరులు.

4 / 6
2015లో టీమిండియాలో అవకాశం రాకపోవడంతో సౌరభ్ అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత 2019లో టీమ్ USA తరపున అరంగేట్రం చేశాడు. అంతేకాదు సౌరభ్ యూఎస్ఏ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

5 / 6
2010లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరపున ఆడిన సౌరభ్.. జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే, ఆ ఎడిషన్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు ఓటమి చవిచూసింది. అయితే, ఇప్పుడు ఆ ఓటమికి ఈరోజు సౌరభ్ టీమిండియా తరపున కాకుండా..  అమెరికా తరపున తన ప్రతీకారం తీర్చుకున్నాడు.

6 / 6
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరభ్ అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించి 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఓవర్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్ ఓవర్‌లో, USA పాకిస్తాన్‌కు 19 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా పాకిస్తాన్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది.