IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

Updated on: Jun 22, 2026 | 8:10 AM

India vs England ODI squad 2026: ప్రతిభను కాదని కేవలం సీనియారిటీకే పీట వేస్తూ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. శతకాలు బాదిన యువ ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేస్తే వారి నైతిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో సిరీస్‌లో ఈ ప్రయోగాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

1 / 5
ఇంగ్లాండ్‌తో జరగబోయే ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, ఎలాంటి విలేకరుల సమావేశం లేకుండా కేవలం ఒక సోషల్ మీడియా ప్రకటనతో ముగించడం చర్చనీయాంశమైంది. శతకాలతో చెలరేగుతున్న యువ కెరటాలను పక్కన పెట్టడంపై అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

2 / 5
అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, 37 ఏళ్ల కోహ్లీ ఆడటం అనేది ఆయన శారీరక సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 22న జరగబోయే ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. మరోవైపు అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి పునరాగమనం చేశారు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా బుమ్రాకు చోటు దక్కింది. కానీ, అద్భుతమైన ఫామ్‌లో ఉండి, జట్టుకు విజయాలు అందించిన ముగ్గురు ఆటగాళ్లను సెలెక్టర్లు పూర్తిగా విస్మరించడం గమనార్హం.

3 / 5
1. యశస్వి జైస్వాల్‌పై మళ్లీ అదే వివక్ష..: భారత జట్టు భవిష్యత్తు ఆశాకిరణం యశస్వి జైస్వాల్‌కు సెలెక్టర్లు మరోసారి షాక్ ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి వన్డేలో అద్భుత శతకంతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను జట్టు నుంచి తొలగించారు. సెంచరీ చేసినా జట్టులో చోటు దక్కకపోవడం జైస్వాల్‌కు ఇది రెండోసారి. నిజానికి కోహ్లీ గాయపడటంతోనే జైస్వాల్‌కు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న అతడు, చివరి మూడు వన్డేల్లో రెండు అద్భుత సెంచరీలు బాదాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 234 సగటుతో 234 పరుగులు చేసినా, ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అభిమానులు బీసీసీఐ తీరును తప్పుబడుతున్నారు. ఒకవేళ కోహ్లీ ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోతేనే జైస్వాల్‌కు మళ్లీ లక్ కలిసి రానుంది.

4 / 5
2. పరుగుల వరద పారిస్తున్నా రుతురాజ్‌కు నిరాశే..: దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల పండగ చేస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా సెలెక్టర్లు కంటితుడుపుగా పక్కన పెట్టేశారు. శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 54.80 సగటుతో ఒక శతకంతో సహా 274 పరుగులు చేశాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా 82.60 సగటుతో 413 పరుగులు గుమ్మరించాడు. దక్షిణాఫ్రికాపై గత వన్డేలో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రుతురాజ్‌ను కూడా జైస్వాల్ లాగే సెంచరీ కొట్టినా పక్కన పెట్టడం విశేషం. ఇంతకంటే ఒక ఆటగాడు తన ప్రతిభను ఎలా నిరూపించుకోవాలో సెలెక్టర్లకే తెలియాలి.

5 / 5
3. కనుమరుగవుతున్న మహమ్మద్ సిరాజ్ ప్రస్థానం..: ఒకప్పుడు మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలతో కలిసి టీమిండియా ప్రధాన పేస్ త్రయంగా నిలిచిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు సెలెక్టర్ల ఆలోచనల్లోనే లేనట్టు కనిపిస్తోంది. గత జనవరిలో న్యూజిలాండ్‌తో చివరి వన్డే ఆడిన సిరాజ్, ఆ తర్వాత అఫ్గానిస్థాన్ సిరీస్‌తో పాటు ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. ఫామ్ లేమి కారణమో, విశ్రాంతో తెలియదు కానీ సిరాజ్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Follow Us