IND vs WI 2nd Test: ఒక్క రన్ చేయకున్నా కోహ్లీదే వరల్డ్ రికార్డ్.. సచిన్‌, పాంటింగ్‌, కల్లిస్‌ని అధిగమించి అగ్రస్థానంలోకి..

|

Jul 20, 2023 | 2:07 PM

IND vs WI 2nd Test: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం ప్రారంభమయ్యే రెండో మ్యాచ్.. ఇరు దేశఆల మధ్య జరుగుతున్న 100వ టెస్ట్.. ఇంకా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 500 అంతర్జాతీయ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఒక్క పరుగు చేయకున్నా వరల్డ్ రికార్డ్‌ని అందుకోగలడు. అదెలా అంటే..

1 / 7
IND vs WI 2nd Test: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం జరిగే రెండో టెస్ట్ ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్, చేజింగ్ మాస్టర్, క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా కోహ్లీ.. రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, జాక్వెస్ కల్లీస్ వంటి దిగ్గజాలను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.

2 / 7
విశేషమేమిటంటే.. విరాట్ కోహ్లీ తన 500వ మ్యాచ్‌లో  ఒక్క పరుగు చేయకుండానే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మ్యా‌న్‌గా అవతరించబోతున్నాడు. అదెలా అంటే 499 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు.

3 / 7
ఇప్పటివరకు 499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 25,461 పరుగులు చేశాడు. 499 మ్యాచ్‌ల్లో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా మాజీ జాక్వెస్ కల్లీస్ వరుస వరుస స్థానాల్లో ఉన్నారు.

4 / 7
ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 500 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో 25,035 పరుగులు చేశాడు.

5 / 7
అలాగే సచిన్ టెండూల్కర్ 499 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 24,874 పరుగులు చేశాడు.

6 / 7
ఇంకా దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లీస్ తన 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో  24,799 రన్స్ చేశాడు.

7 / 7
అంటే విరాట్ కోహ్లీ ఇప్పటికే ఈ ముగ్గురు ఆటగాళ్ల రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు చేయకుండానే దిగ్గజాలను అధిగమించి అగ్రస్థానంలోకి చేరగలడు.