IND vs WI: అనిల్ కుంబ్లే రికార్డ్‌‌‌కి అశ్విన్ బ్రేక్.. భారత్ తరఫున రెండో ఆటగాడిగా మాజీ కెప్టెన్ల నడుమలోకి..

|

Jul 24, 2023 | 8:42 AM

IND vs WI 2nd Test: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకుని, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ తర్వాతి స్థానంలోకి చేరాడు. ఇంతకు అశ్విన్ సాధించిన ఆ ఘనత అదేమిటంటే..?

1 / 5
IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ నాల్గో రోజు ఆటలో అశ్విన్.. వెస్టిండీస్ ప్లేయర్లు క్రైగ్ బ్రెత్‌వైట్, కిర్క్ మెకంజీ వికెట్లను పడగొట్టాడు.

2 / 5
తద్వారా వెస్టిండీస్‌పై భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్(75) అవతరించాడు. అంతక ముందు ఈ రికార్డ్ టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే(74) పేరిట ఉండేది.

3 / 5
కాగా, భారత్ తరఫున అత్యధిక విండీస్ వికెట్లు తీసిన ఆటగాడిగా 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ వెస్టిండీస్‌పై మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు.

4 / 5
అశ్విన్ 75 వికెట్లతో రెండో స్థానంలో.. కుంబ్లే 74 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంటే ఈ లిస్టులో టీమిండియా మాజీ కెప్లెన్ల నడుమకు అశ్విన్ చేరాడు.

5 / 5
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన నాల్గో ఆటగాడిగా శ్రీనివాస వెంకటరాఘవన్ 68 వికెట్లతో ఉండగా.. ఐదో స్థానంలో 65 వెస్టిండీస్ వికెట్లు తీసిన భగ్వంత్ చంద్రశేఖర్ ఉన్నాడు.