ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆదిలోనే భారత్ కష్టాల్లో కూరుకపోయింది.
టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ ఏలో భాగంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ మూడు బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో, నేటి మ్యాచ్‌తో సహా ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ఔటయ్యాడు.
ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 13 పరుగుల వద్ద షాషీన్ షా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది.
ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ కీలకమైన 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది.