- Telugu News Photo Gallery Cricket photos IND vs ENG: England will finish a home summer without a Test series win after 2001
IND vs ENG: ఓవల్‌లో ఓటమి 20 ఏళ్ల గాయాన్ని మిగిల్చింది.. ఇంగ్లండ్‌ను భారీగా దెబ్బ తీసిన భారత్.. ఎందులోనే తెలుసా?
ఓవల్ టెస్టులో ఓడిపోవడం ద్వారా ఇంగ్లండ్ టీంకు 20 ఏళ్ల గాయాన్ని గుర్తుచేసుకున్నట్లు ఉంది. ఒకవేళ చివరి టెస్టులో కూడా ఓడిపోతే 1986 తరువాత స్వదేశంలో 2 సిరీస్‌లను కోల్పోయిన జట్టుగా మారనుంది.
Updated on: Sep 07, 2021 | 3:28 PM

ఓవల్ టెస్టులో టీమిండియాపై ఘోర పరాజయం కలిగించిన బాధ ఇంగ్లండ్‌కు చాలా చాలం వరకు గుర్తుండిపోతుంది. ఈ ఓటమితో 20 ఏళ్ల గాయాలను మరోసారి గుర్తుచేసింది. టెస్ట్ సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉంది. కానీ, ఇంగ్లండ్ జట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకు అదేంటో తెలుసా..?

ఓవల్ టెస్టులో ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్ 2001 గాయాన్ని గుర్తుచేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చతికిలబడినా.. రెండో ఇన్నింగ్స్‌లో కోలుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. అయితే హోమ్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు సమ్మర్‌లో ఆడిన టెస్టు సిరీస్‌లో గెలవకపోవడం 2001 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి కానుంది. అయితే ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే.. ఇంగ్లండ్ టీంకు మరో అపఖ్యాతిని మిగల్చనుంది. టీమిండియాతో జరగనున్న చివరి టెస్ట్‌పై చాలా ఆశలు పెట్టుకుంది ఇంగ్లండ్ టీం.

మాంచెస్టర్‌లో జరిగే 5 వ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్ టీం సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలదు. కానీ, సిరీస్‌ను గెలవలేదు. ఒకవేళ మాంచెస్టర్‌లో కూడా ఇంగ్లండ్ జట్టు గందరగోళంగా తయారైతే మాత్రం.. 35 ఏళ్ల క్రితం గాయాన్ని మరోసారి అంటించుకోనుంది. మాంచెస్టర్‌లో మ్యాచ్ ఓడితే.. 1986 తర్వాత ఇంగ్లండ్ జట్టు ఒకే వేసవిలో 2 హోమ్ టెస్ట్ సిరీస్‌లను కోల్పోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు జూన్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన టెస్టు సిరీస్‌ను 1-0తో కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరోవైపు, మాంచెస్టర్‌లో టీమిండియా గెలిస్తే, 5 టెస్టుల సిరీస్‌లో 3-1తో కైవసం చేసుకుంటుంది. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో ఇది కోహ్లీకి మొదటి టెస్ట్ సిరీస్ విజయం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌లో భారత్ సాధించిన తొలి టెస్టు సిరీస్‌గా నిలవనుంది.





























