
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ఫైనల్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగుల జాబితాలో శ్రీలంక గ్రేట్ బ్యాటర్ కుమార సంగక్కరను అధిగమించాడు.

సంగక్కర 39 ఇన్నింగ్స్‌లలో 1532 పరుగులకు చేరుకోగా, రోహిత్ ఈ మ్యాచ్‌లో 4 పరుగులు పూర్తి చేయగానే కుమార సంగక్కరను అధిగమించాడు.

భారత కెప్టెన్ మొత్తం జాబితాలో నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. అతని కంటే భారత దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ ఉన్నారు.

ఫైనల్‌కు ముందు, రోహిత్ 27 ఇన్నింగ్స్‌లలో 61.12 సగటు, 104.51 స్ట్రైక్ రేట్‌తో 1528 పరుగులు చేశాడు.

2023 ఎడిషన్‌లో రోహిత్ 10 ఇన్నింగ్స్‌ల్లో 550 పరుగులు చేశాడు. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో అత్యధిక సెంచరీలు (7) సాధించిన ఆటగాడిగా కూడా హిట్‌మ్యాన్ రికార్డు సృష్టించాడు.