- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS 4th T20I india surpasses pakistan and makes reocord of most t20i wins
IND vs AUS 4th T20I: టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా భారత్.. పాకిస్థాన్ రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య సేన..
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 174/9 స్కోర్ చేసింది. ఇందులో రింకు సింగ్ 46 పరుగులు, యశస్వి జైస్వాల్ 37 పరుగులు, జితేష్ శర్మ 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఓవర్లు మొత్తం ఆడినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు లక్ష్యాన్ని చేధించలేదు. 20 ఓవర్లలో 154/7 మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్‌ను గెలుచుకుంది.
Updated on: Dec 02, 2023 | 8:48 AM

India vs Australia: ప్రస్తుతం జరుగుతున్న 5-మ్యాచ్‌ల T20I సిరీస్‌లో (IND vs AUS) నాల్గవ మ్యాచ్ రాయ్‌పూర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. దీనిలో ఆతిథ్య జట్టు 20 పరుగుల తేడాతో విజిటింగ్ జట్టును ఓడించింది. ఈ విజయంతో భారత్ భారీ విజయాన్ని సాధించి టీ20 ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. అంతర్జాతీయ స్థాయిలో, అతి తక్కువ ఫార్మాట్‌లో జట్లను భారత్ అత్యధిక సార్లు ఓడించింది. ఆస్ట్రేలియాను ఓడించి, అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది.

2006లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన భారత జట్టు ఇప్పటి వరకు ఈ ఫార్మాట్‌లో మొత్తం 213 మ్యాచ్‌లు ఆడగా, అందులో 136 మ్యాచ్‌లు గెలిచి మిగతా జట్ల కంటే అధిక విజయాలతో దూసుకెళ్తోంది. ఇంతకుముందు టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాక్ జట్టు ఘనత సాధించగా, ఇప్పుడు భారత జట్టు వారికంటే ముందుంది. 226 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ 135 మ్యాచ్‌లు గెలిచింది.

ఇప్పటి వరకు 200 టీ20 మ్యాచ్‌లు ఆడి 102 విజయాలు నమోదు చేసిన న్యూజిలాండ్ జట్టు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు 181 మ్యాచ్‌ల్లో 95 విజయాలతో సంయుక్తంగా నాలుగో స్థానంలో, దక్షిణాఫ్రికా 171 మ్యాచ్‌ల్లో 95 విజయాలతో ఉమ్మడి నాలుగో స్థానంలో ఉన్నాయి. 177 టీ20 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టును 92 సార్లు ఓడించిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 174/9 స్కోర్ చేసింది. ఇందులో రింకు సింగ్ 46 పరుగులు, యశస్వి జైస్వాల్ 37 పరుగులు, జితేష్ శర్మ 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.

అనంతరం ఓవర్లు మొత్తం ఆడినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు లక్ష్యాన్ని చేధించలేదు. 20 ఓవర్లలో 154/7 మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్‌ను గెలుచుకుంది. ఇది స్వదేశంలో వారి వరుసగా 14వ T20I సిరీస్ విజయం.





























