ICC Test Rankings: శ్రీలంక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినా.. భారత ప్లేయర్లకు షాకిచ్చిన ఐసీసీ.. దిగజారిన జడేజా, కోహ్లీ ర్యాంకులు..

|

Mar 16, 2022 | 3:19 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో గతవారం నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి పడిపోయాడు.

1 / 5
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో గతవారం నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో బెంగళూరులో జరిగిన టెస్టులో జడేజా విఫలం కావడంతో ఈ మార్పులు జరిగాయి. అదే సమయంలో, జాసన్ హోల్డర్ మరోసారి నంబర్ వన్ కుర్చీని ఆక్రమించాడు.

2 / 5
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

3 / 5
బ్యాట్స్‌మెన్‌లలో మార్నస్ లాబుస్‌చాగ్నే నంబర్ వన్‌గా మరగా, రోహిత్ శర్మ టీమిండియా తరపున టాప్ టెస్ట్ ర్యాంక్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ ఆరో స్థానంలో నిలిచాడు.

4 / 5
విరాట్ కోహ్లీ మాత్రం తన పేలవ ఫాంతో తంటాలు పడుతున్నాడు. మొత్తంగా నాలుగు ర్యాంకులు దిగజారి 9వ స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ తన ఆటతో ఆకట్టుకుని టాప్ 10లో నిలిచాడు.

5 / 5
భారత్‌తో బెంగళూరు టెస్టులో సెంచరీ సాధించిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే 5వ  స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లి స్థానంలో దిముత్ చేరాడు.