ICC Rankings: బంగ్లాకు బిగ్ షాకిచ్చారు.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి ఊహించని గిఫ్ట్ పట్టేసిన భారత ఆటగాళ్లు

|

Oct 09, 2024 | 5:40 PM

ICC Rankings: ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు ఊహించని సర్‌ప్రైజ్ పొందారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు.

1 / 6
ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు ఊహించని సర్‌ప్రైజ్ పొందారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు.

2 / 6
బంగ్లాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 39 పరుగులతో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్.. బౌలింగ్‌లోనూ 1 వికెట్ తీయగలిగాడు. తన ఆటతో జట్టుకు విజయాన్ని అందించిన పాండ్యా.. ప్రస్తుతం టీ20 ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ జాబితాలో 4 స్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.

3 / 6
బంగ్లాదేశ్‌తో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ హార్దిక్ తన ప్రదర్శనను కొనసాగిస్తే నంబర్ 1గా నిలిచే అవకాశం ఉంది. హార్దిక్ 216 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆయనతో పాటు నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్‌ ఐరీ రెండో స్థానంలో ఉన్నారు.

4 / 6
దానికితోడు బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దానిని సద్వినియోగం చేసుకున్న జడేజా టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 468 రేటింగ్ పాయింట్లతో జడేజా మొదటి స్థానంలో ఉండగా, 358 రేటింగ్ పాయింట్లతో ఆర్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

5 / 6
అలాగే, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో కూడా చాలా ప్రయోజనం పొందాడు, ప్రస్తుతం, బుమ్రా 870 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు.

6 / 6
అతనితో పాటు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబరిచిన యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం జైస్వాల్ 792 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.