IND vs ZIM: మూడో T20Iలో 3 కీలక మార్పులు.. మారనున్న టీమిండియా ప్లేయింగ్ XI?

|

Jul 10, 2024 | 5:14 PM

3 Changes in Team India Playing XI for 3rd T20I: భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే (IND vs ZIM) పర్యటనలో ఉంది. అక్కడ ఇరు దేశాల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. జులై 6న జరిగిన మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభమైంది. ఇందులో ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలిచింది. కాగా, మిగతా మ్యాచ్‌లను శుభ్‌మన్ గిల్ అండ్ కంపెనీ 100 పరుగుల తేడాతో గెలుపొందడంతో సిరీస్ 1-1తో సమమైంది.

1 / 5
3 Changes in Team India Playing XI for 3rd T20I: భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే (IND vs ZIM) పర్యటనలో ఉంది. అక్కడ ఇరు దేశాల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. జులై 6న జరిగిన మ్యాచ్‌తో సిరీస్ ప్రారంభమైంది. ఇందులో ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలిచింది. కాగా, మిగతా మ్యాచ్‌లను శుభ్‌మన్ గిల్ సేన 100 పరుగుల తేడాతో గెలుపొందడంతో సిరీస్ 1-1తో సమమైంది.

2 / 5
సిరీస్‌లోని మూడో మ్యాచ్ ఇప్పుడు జులై 10న జరగనుంది. ఇందులో విజయం సాధించడం ద్వారా ఇరు జట్లు ఆధిక్యాన్ని పొందాలనుకుంటున్నాయి. మూడవ T20Iలో టీమిండియా తన ప్లేయింగ్ XIలో చేయవలసిన 3 కీలక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 5
1. ధృవ్ జురెల్ స్థానంలో సంజు శాంసన్: టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత కొంత విరామం తీసుకున్న సంజూ శాంసన్.. భారత జట్టులో చేరాడు. ధృవ్ జురెల్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగంగా ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. శాంసన్ లాంటి సీనియర్ వికెట్ కీపర్ వచ్చిన తర్వాత జురెల్ ఇప్పుడు బెంచ్ పై కూర్చోవాల్సి వస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను ఈ సిరీస్‌లో కొన్ని భారీ ఇన్నింగ్స్‌లు ఆడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాడు.

4 / 5
2. సాయి సుదర్శన్ స్థానంలో యశస్వి జైస్వాల్: సంజూ శాంసన్‌తో పాటు, యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ కూడా సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఎంపికకు అందుబాటులో ఉంటాడు. శాంసన్ లాగా, జైస్వాల్ కూడా 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు మూడో టీ20లో సాయి సుదర్శన్ స్థానంలో జైస్వాల్ ఆడనున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు అతను జట్టులో భాగమైనందున సుదర్శన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది.

5 / 5
3. ముఖేష్ కుమార్ స్థానంలో తుషార్ దేశ్ పాండే: ముంబై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్ పాండే తొలిసారిగా జాతీయ జట్టులో భాగమయ్యాడు. మూడో టీ20లో ముకేశ్ కుమార్ స్థానంలో తుషార్ కూడా భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 మ్యాచ్‌లో ముఖేష్ 3 వికెట్లు పడగొట్టాడు. అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఫిట్‌నెస్‌ను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో, సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చు. తుషార్ అతని వేగవంతమైన పేస్, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో పేరు తెచ్చుకున్నాడు.