
T20 World Cup 2024: బార్బడోస్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

ఈ విధంగా ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే, వీరిలో ముగ్గురు ఆటగాళ్లకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికై భారత్ తరపున ఆడని ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సంజు శాంసన్: ఈ టీ20 ప్రపంచకప్‌నకు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా ఎంపికైన సంజూ శాంసన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. రిషబ్ పంత్ బాగా బ్యాటింగ్ చేయడంతో శాంసన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

యుజ్వేంద్ర చాహల్: అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. టోర్నీ ఆద్యంతం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బాగా బౌలింగ్ చేయడంతో చాహల్ ఆడే జట్టులోకి ఎంపిక కాలేదు.

యశస్వీ జైస్వాల్: టీ20 ప్రపంచకప్‌నకు ఓపెనర్‌గా ఎంపికైన యశస్వీ జైస్వాల్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించడంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో జైస్వాల్‌కు అవకాశం దక్కలేదు.

టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), సంజు శాంసన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.