
క్రికెటర్లు భారీ మొత్తంలో డబ్బు, పేరును సంపాదింస్తారనడంలో సందేహం లేదు. అయితే, వారి కెరీర్ కారణంగా చదువును కొనసాగించలేక మధ్యలోనే వదిలేస్తారు. ఇలాంటి వారు టీమిండియాలో చాలామందే ఉన్నారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి స్టార్ ఆటగాళ్లు పెద్దగా చదువుకోలేదని మనకు తెలుసు. కానీ, మైదానంలో మాత్రం అన్ని డిగ్రీలను పూర్తి చేసి విజయవంతంగా రాణించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అయితే ప్రస్తుతం మనం కొంతమంది స్టార్ క్రికెటర్ల భార్యల విద్యార్హతలు తెలుసుకుందాం.

అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా సారథి విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనుష్క ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలాగే ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ను కూడా పూర్తి చేసింది.

సాక్షి ధోని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ధోని హెూటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసింది. ఔరంగాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో చదువు పూర్తి చేసింది.

రితికా సజ్దేహ్ రోహిత్ శర్మ భార్య రితికా జ్దేహ్ స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె తన కజిన్ సోదరుడు బంటీ సజ్దేహ్‌కు సంబంధించిన సంస్థలో జాబ్ చేస్తోంది.

అంజలి టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్ ఓ డాక్టర్. సచిన్, అంజలి మొదట ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నారు. అ సమయంలో అంజలి వైద్య విద్యను చదువుతోంది.

ప్రియాంక రైనా టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా భార్య ప్రియాంక రైనా బీటెక్ పూర్తి చేసింది. అలాగే యాక్సెంచర్, విప్రో వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసింది.