Chennai Super Kings: 6వ ట్రోఫీ కోసం ప్రాక్టీస్ షురూ.. చెన్నైలో అడుగుపెట్టిన సీఎస్‌కే ఆటగాళ్లు.. మిస్సైన ధోని..

|

Mar 03, 2024 | 9:41 AM

IPL 2024: రాబోయే టోర్నమెంట్ కోసం శిక్షణ ప్రారంభించిన ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ.. చెన్నైలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది. శుక్రవారం ఈ శిబిరానికి కొంతమంది క్రీడాకారులు వచ్చారు. అయితే, ఈ శిబిరంలో అందరి దృష్టి దీపక్ చాహర్‌పైనే ఉంటుంది. ఎందుకంటే నిత్యం గాయాలతో సతమతమవుతున్న చాహర్.. తన తండ్రి ఆరోగ్యం దృష్ట్యా డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను వదిలి స్వదేశానికి చేరుకున్నాడు.

1 / 8
ఐపీఎల్ 17వ ఎడిషన్ ఈ నెల మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కి మూడు వారాల కంటే తక్కువ సమయం ఉంది.

2 / 8
ఇలా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ త్వరలో జరగనున్న టోర్నీ కోసం కసరత్తు ప్రారంభించింది. చెన్నైలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది. శుక్రవారం ఈ శిబిరానికి కొంతమంది క్రీడాకారులు వచ్చారు. PTI ఇన్‌పుట్ ప్రకారం, ఎంఎస్ ధోని ఎప్పుడు వస్తాడనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేదు.

3 / 8
శుక్రవారం ప్రారంభమైన శిబిరం నిన్న కూడా కొనసాగగా అందులో స్టార్ పేసర్ దీపక్ చాహర్ కూడా కనిపించాడు. భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ శుక్రవారం శిబిరానికి చేరుకున్నట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధికారి పిటిఐకి తెలిపారు.

4 / 8
రానున్న రోజుల్లో మరికొంత మంది క్రీడాకారులు శిబిరానికి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముఖేష్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, రాజవర్ధన్ హంగర్‌గేకర్, ప్రశాంత్ సోలంకి, అజయ్ మండల్, దీపక్ చాహర్ శిబిరంలో పాల్గొంటున్నారు.

5 / 8
ఈ శిబిరంలో అందరి దృష్టి దీపక్ చాహర్‌పైనే ఉంటుంది. ఎందుకంటే నిత్యం గాయాలతో సతమతమవుతున్న చాహర్.. తన తండ్రి ఆరోగ్యం దృష్ట్యా డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను వదిలి స్వదేశానికి చేరుకున్నాడు.

6 / 8
ఆ తర్వాత, మళ్లీ గాయపడిన చాహర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పొందాడు. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న అతను ఐపీఎల్‌లో సందడి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. దీని ద్వారా 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో చాహర్ కూడా ఉన్నాడు.

7 / 8
క్యాంప్‌లో భారత ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. టీమిండియా కెప్టెన్ ధోని మాత్రమే ఇంకా చెన్నై చేరుకోలేదు. ప్రస్తుతం ధోనీ క్యాంప్‌లో ఎప్పుడు చేరుతారనే దానిపై ఖచ్చితమైన వార్తలు లేవని PTI తన నివేదికలో పేర్కొంది.

8 / 8
చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్: CSK మార్చి 22న RCBతో, మార్చి 26న గుజరాత్ టైటాన్స్‌తో, మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది.