న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలవ్వడంతో బీసీసీఐ మేల్కొంది. గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే, రాబోయే బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ గంభీర్‌కు లిట్మస్ టెస్ట్ కానుంది. ఈ టెస్టులో టీమ్ఇండియా విఫలమైతే గంభీర్‌కు శిక్ష తప్పదు.
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోతే భారత జట్టు కోచ్ మారడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. టెస్టు, వన్డే/ టీ20 జట్లకు ప్రత్యేక కోచ్‌ను నియమించాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ ఓడిపోతే గౌతమ్ గంభీర్‌ను టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వన్డే జట్టుకు కోచ్‌గా కొనసాగే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమ్ఇండియా పేలవ ప్రదర్శన చేస్తే గౌతమ్ గంభీర్‌కు గేట్ పాస్ దక్కే అవకాశం ఉంది. దీంతో ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ గంభీర్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.
నవంబర్ 22 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరుజట్లు ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడనుండగా, ఇందులో 4-0తో గెలిస్తేనే భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరకపోతే గౌతమ్ గంభీర్ ఆటతీరుపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతాయి. అందుకే, భారత టెస్టు కోచ్ పదవిని నిలబెట్టుకోవాలంటే గౌతమ్ గంభీర్‌కు ఆస్ట్రేలియాలో భారీ విజయం అవసరం.