2022 నాటి పొరపాట్లు 2023లో పునరావృతం కాకుండా చూసేందుకు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే యాక్షన్ మోడ్‌లోకి వస్తోంది. ఇది T20 ప్రపంచ కప్ 2022 పేలవమైన ప్రదర్శనపై సమీక్షతో ప్రారంభమవుతుంది. దీనిలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి కఠినమైన ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి.
వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం, జనవరి 1 న, బీసీసీఐ ఉన్నతాధికారులు కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌తో టీమిండియా ఆటతీరుపై చర్చించనున్నారు. దాని కారణాలను తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్లే మార్గంపై పనిచేయనున్నారు. ద్రవిడ్ గైర్హాజరీలో భారత జట్టులో ఉన్న ఎన్‌సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
1. రోహిత్ శర్మ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్‌లో వన్డే క్రికెట్‌లో 125 సిక్సర్లు కొట్టాడు. అంతే కాకుండా వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా హిట్‌మన్ పేరిట ఉంది. రోహిత్ శర్మ 239 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 265 సిక్సర్లు బాదాడు.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి సెమీఫైనల్ నుంచే ఇంటిబాట పట్టింది. దీంతో 2013 నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ నిరీక్షణ మరింత పెరిగింది.
కొత్త సంవత్సరంలో భారత జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జనవరి 3 నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉండగా, అంతకంటే ముందు ఈ సమావేశం ముంబైలోనే జరగనుంది.