AUS vs SA: 13 ఫోర్లు, 13 సిక్సులు.. 209 స్ట్రైక్‌రేట్‌తో కంగారులపై ఊచకోత.. తుఫాన్ సెంచరీతో సరికొత్త రికార్డ్..

|

Sep 16, 2023 | 6:00 AM

Heinrich Klaasen: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 4వ వన్డేలో సౌతాఫ్రికా 164 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ తుఫాన్ సెంచరీతో చెలరేగాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన క్లాసన్ కేవలం 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 174 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

1 / 5
Australia Vs South Africa: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ తుఫాన్ సెంచరీతో చెలరేగాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకపడ్డాడు.

2 / 5
సౌతాఫ్రికా తరుపున ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన క్లాసన్.. కేవలం 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 174 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

3 / 5
ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా నలుగురు బ్యాట్స్‌మెన్‌ల విధ్వంసక ఇన్నింగ్స్‌తో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 416 పరుగులు చేసింది.

4 / 5
జట్టుకు ఓపెనర్‌గా వచ్చిన క్వింటన్ డి కాక్ 45 పరుగుల వద్ద తన వికెట్‌ను లొంగిపోగా, రీజా హెండ్రిక్స్ 28 పరుగుల సహకారం అందించాడు. ఆ తర్వాత వచ్చిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 65 బంతుల్లో 62 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.

5 / 5
ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 174 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగా, అతనితో పాటు లోయర్ ఆర్డర్‌లో ఆడిన డేవిడ్ మిల్లర్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఆసీస్‌ తరపున హేజిల్‌వుడ్‌ 2 వికెట్లు తీయగా, నాజర్‌, స్టోయినిస్‌, ఎల్లిస్‌ ఒక్కో వికెట్‌ తీశారు.