
దక్షిణాది చిత్ర సీమలో అగ్ర హీరోయిన్‌గా పేరుగాంచిన నయనతార పెళ్లయిన నాలుగు నెలలకే తల్లి అయ్యింది. నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ప్రకటించారు.

ఈ ఏడాది జూన్ 9న నయనతార, విఘ్నేష్‌లకు వివాహం జరిగింది. సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యినట్లు నయన్, విఘ్నేష్ ప్రకటించినప్పటి నుంచి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఐతే పెళ్లికి ముందే కొన్నేళ్లుగా వారు రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.

కవల పిల్లలు ఎలా పుట్టారనే విషయంపై వివరాలు ఇవ్వాలని ఈ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం సుబ్ర్మణ్యం నోటిసులు జారీ చేశారు.

నిజానికి సరోగసినియంత్రణ చట్టం2021 ప్రకారం భారత్‌లో పెళ్లి అయిన జంటలతోపాటు విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన ఒంటరి మహిళలు మాత్రమే సరోగసి ద్వారా పిల్లలను కనడానికి అనుమతి ఉంది.

నయన్ దంపతుల విషయంలో సరోగసి ప్రాసెస్ పెళ్లికి ముందే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పెళ్లికి సుమారు 5 నెలల ముందే అద్దె గర్భంలో నయనతార దంపతుల బిడ్డలు పెరగడం ప్రారంభమైంది. ఆ విధంగా పెళ్లికి ముందే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకున్నారు కాబట్టి వీరు చేసింది చట్టప్రకారం నేరం అవుతుంది.

అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడాన్ని సరోగసీ అంటారు. అంటే వేరే మహిళ, పురుషులకు చెందిన బిడ్డను మరొక మహిళ తన గర్భంలో మోస్తుందన్నమాట.

ఐతే ప్రసవం తర్వాత బిడ్డను మోసే మహిళకు ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులు ఉండవు. అండం, వీర్యం ఇచ్చిన వారే ఆ బిడ్డకు తల్లిదండ్రులవుతారు.

ఐతే రోగసినియంత్రణ చట్టం2021లో పెళ్లి కానీ వ్యక్తుల గురించి ప్రస్తావన లేదు. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఎల్జీబీటీ కమ్యూనిటీకి సరోగసి ద్వారా బిడ్డలను కనడానికి ఈ చట్టం ద్వారా అనుమతి లేదు. సహజీనవం చేసే జంటలకు కూడా సరోగసి ద్వారా పిల్లల్నికనే అవకాశం లేదు. నయన్, విఘ్నేష్‌లు కూడా సరిగ్గా విషయంలోనే పప్పులో కాలేశారు.