
నువ్వుల పాయసం రెసిపీకి కావలసిన పదార్థాలు: అర కప్పు నువ్వులు, పావు కప్పు బెల్లం , రెండు కప్పులు పాలు, ఒక కప్పు బియ్యం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు , 10 కిస్‌మిస్ , రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక కప్పు మంచి నీళ్ళను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే తియ్యగా ఉంటుంది.

నువ్వుల పాయసం తయారీ విధానం: ముందుగా నువ్వులను తీసుకుని మీడియం మంటపై వాసన వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఆ తరవాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇంకా వేయించిన నువ్వులను మిక్సీలో దీనిని పొడిలాగా చేసుకోవాలి. ఇంకా దీనిలో నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.

నువ్వుల పాయసం తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా ఒక పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసి దీనిలో బియ్యాన్ని బాగా ఉడికించాలి. ఆ తరువాత బియ్యం ఉడికిన తర్వాత కొద్దిగా పాలు పోసి మీడియం మంటపై 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇక ఇప్పుడు తురిమిన బెల్లాన్ని కూడా నీటిలో కరిగించి వాటిని ఒకసారి వడగట్టి ఈ పాయసంలో కలపాలి.

నువ్వుల పాయసం తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా ఈ నువ్వుల పొడి వేసిన తర్వాత ఇది ఉండలు ఉండలు లేకుండా గట్టిగా కలుపుతూ మరో 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేస్తె పాయసానికి మంచి వాసన వస్తుంది. మీరు కూడా ఇంట్లో చేసేటప్పుడు పక్కా కొలతలతో చేస్తే సూపర్ వస్తుంది.

నువ్వుల పాయసం తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి లేదా నెయ్యి వేసి, అది బాగా వేడయ్యాక 10 జీడిపప్పు, 10 కిస్‌మిస్‌ను గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా దీనిలో వేయించిన డ్రైఫ్రూట్స్‌ను పాయసంలో వేసి వేడి వేడిగా తింటే, ఆ రుచే వేరు.