Clove Water: లవంగాల నీరు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టే సహజ చిట్కా.. కానీ వారు మాత్రం తీసుకోవద్దు!

Updated on: Jan 23, 2026 | 12:43 PM

ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం, షుగర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయుర్వేదంలో సూచించిన లవంగం నీరు (Clove Water) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ లవంగం నీరు తాగితే శరీరంలో అనేక మంచి మార్పులు కనిపిస్తాయని అంటున్నారు.

1 / 6
Clove water benefits: లవంగాలు.. వంటింట్లో ఉండే ఒక మసాల దినుసు మాత్రమే కాదు.. ఎన్నో ఔషధాల గుణాలున్న విలువైన ఆహార పదార్థం. అందుకే లవంగాలు ఆహారంతోపాటు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలు ఏ విధంగా తీసుకున్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. ఆధునిక  జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం, షుగర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయుర్వేదంలో సూచించిన లవంగం నీరు (Clove Water) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ లవంగం నీరు తాగితే శరీరంలో అనేక మంచి మార్పులు కనిపిస్తాయని అంటున్నారు.

2 / 6

లవంగం ఎందుకు అంత ప్రత్యేకం... లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని రోగాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లవంగం నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. లవంగం నీరు తాగితే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణరసాల ఉత్పత్తి పెరిగి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

3 / 6

రోగనిరోధక శక్తి పెరుగుదల.. లవంగంలో ఉన్న సహజ ఔషధ గుణాలు శరీరానికి రోగనిరోధక శక్తిని అందించి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.  లవంగం నీరు సహజ మౌత్‌వాష్‌లా పనిచేస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. పళ్ల నొప్పి, చిగుళ్ల వాపు, 
లాంటివి తగ్గుతాయి. దగ్గు, జలుబుకు ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నీరు గొంతునొప్పి, దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుదల.. లవంగంలో ఉన్న సహజ ఔషధ గుణాలు శరీరానికి రోగనిరోధక శక్తిని అందించి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. లవంగం నీరు సహజ మౌత్‌వాష్‌లా పనిచేస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. పళ్ల నొప్పి, చిగుళ్ల వాపు, లాంటివి తగ్గుతాయి. దగ్గు, జలుబుకు ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నీరు గొంతునొప్పి, దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

4 / 6

షుగర్ నియంత్రణకు సహాయం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో లవంగం నీరు తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేగాక, మెటబాలిజం పెరగడం వల్ల కొవ్వు కరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉండి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లవంగం నీరు శరీరంలోని విషపదార్థాలను తొలగించి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

5 / 6

లవంగం నీరు ఎలా తయారు చేయాలంటే.. 2 లేదా 3 లవంగాలు తీసుకోండి. ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరింత లాభం. 
అయితే, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అధిక మోతాదులో తాగకూడదు.

లవంగం నీరు ఎలా తయారు చేయాలంటే.. 2 లేదా 3 లవంగాలు తీసుకోండి. ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరింత లాభం. అయితే, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అధిక మోతాదులో తాగకూడదు.

6 / 6

లవంగం నీరు తీసుకునేవారికి సూచనలు.. గర్భిణీలు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. లవంగం నీరు ఆరోగ్యానికి మేలు చేసినా.. వివిధ రోగాలను తగ్గించే మందులకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం, వ్యాయామంతో పాటు దీన్ని అలవాటు చేసుకోవాలి.