దాల్చిన చెక్కను ఇలా తినండి.. స్థూలకాయం, మధుమేహానికి దివ్యౌషధం..!

|

Jun 06, 2024 | 1:01 PM

దాల్చిన చెక్క... ఇది ఒక సుగంధ ద్రవ్యం. సిన్నమోమమ్ కుటుంబానికి చెందిన ఒక చిన్న సతత హరిత చెట్టు లోపలి బెరడు నుండి వస్తుంది. ఒకప్పుడు బంగారం కంటే విలువైనది. ఈ మసాలా ఆహ్లాదకరమైన రుచి, కమ్మటి ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఇది వంటలో ముఖ్యంగా బేకింగ్, కూరలలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇది పురాతన కాలం నుండి ఉపయోగించే అత్యంత ప్రసిద్ధ ఔషధ మసాలా.

1 / 5
భారతీయ ఆహారంలో ఉపయోగించే మసాలాలు వైవిధ్యమైనవి. ఈ మసాలాలు ఆహార రుచిని పెంచుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు.. దాల్చిన చెక్క.. షుగర్‌ పేషెంట్స్‌కు ఔషదంలా పని చేస్తుందని పలువురు హోమియోపతి నిపుణులు చెబుతున్నారు. దాల్చినచెక్క చెట్టు బెరడు వంటి మసాలా దినుసు. ఈ దాల్చిన చెక్క జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది. దాల్చినచెక్క బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

2 / 5
దాల్చిన చెక్కని ఓ మసాలా దినుసుగా వాడతాం. అయితే అందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయి. దాల్చిన చెక్కకు బ్యాక్టీరియాను నిరోధించే శక్తి వుంది. కాబట్టి మనం తాగే నీటిలో ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే బ్యాక్టీరియాకి చెక్ చెప్పినట్టే అంటున్నారు నిపుణులు. దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి అందుతాయి. కార్బోహైడ్రేట్లు ఇనుము, కాల్షియం, మెగ్నీషియంకు ఇది మంచి మూలం.

3 / 5
బరువు తగ్గాలనుకునే వారు దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క గుండెకు మేలు చేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే తరచూ ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా ఉంటారు.

4 / 5
ఇక కీళ్ళ నొప్పులతో ఇబ్బందిపడేవారు రోజు ఒక అర టీ స్పూను దాల్చిన చెక్క పొడిని ఒక స్పూను తేనెలో కలుపుకుని తాగితే నొప్పులు తగ్గుతాయి. రోజువారీ వంటలో కొద్దిగా దాల్చిన చెక్క పొడివాడితే చాలు ఎముకల అరుగుదల సమస్యలు వుండవు. దాల్చిన చెక్కలో ఉండే మాంగనీసు, డయాటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం... ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవే.

5 / 5
Cinnamon

Cinnamon