టాలీవుడ్‌కు సరికొత్త సక్సెస్ ఫార్ములా.. ఈ జోనర్‌లో సినిమా తీస్తే హిట్ పక్కా

Edited By: Phani CH

Updated on: Jun 16, 2025 | 9:50 PM

తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త సక్సెస్ ఫార్ములా దొరికిందా..? ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ కథలు అల్లుకుంటే సినిమా సూపర్ హిట్ ఖాయమా..? కరోనా తర్వాత ఈ తరహా కథలకు సక్సెస్ రేట్ కనిపిస్తుంది. అందుకే దర్శకులు అదే రూట్‌లో వెళ్తున్నారా..? తాజాగా మరో సినిమా కూడా ఈ జోనర్‌లోనే వస్తుంది. మరి అదేంటి..? దానికి ముందు వచ్చిన సినిమాలేంటి..?

1 / 5
Jathiratnalu (1)

Jathiratnalu (1)

2 / 5
2021లో వచ్చిన జాతి రత్నాలు నుంచి మొదలు పెడితే మొన్నొచ్చిన మ్యాడ్ స్క్వేర్.. ఇప్పుడొస్తున్న మిత్ర మండలి వరకు అన్నీ ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఫన్నీ స్టోరీసే.

3 / 5
తాజాగా మిత్రమండలి సినిమా వస్తుంది.. ఇందులో ప్రియదర్శి హీరోగా నటిస్తుంటే.. ఆయన స్నేహితులుగా మ్యాడ్‌లో లడ్డుగా నటించిన విష్ణు, రాగ్ మయూర్ అతడి స్నేహితులుగా నటిస్తున్నారు. అలాగే ప్రసాద్ బెహరా మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

4 / 5
బన్నీ వాస్ కొత్త బ్యానర్ BV ఆర్ట్స్‌లో ఈ సినిమా వస్తుంది. మిత్ర మండలి టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముగ్గురు ఫ్రెండ్స్ అనే సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. బ్రోచేవారెవరురాతో పాటు ఓం భీమ్ బుష్‌లో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఫ్రెండ్స్‌గా నటించారు.

5 / 5
అలాగే జాతి రత్నాలులో నవీన్ పొలిశెట్టితో కలిసి రాహుల్, దర్శి నటించారు. మ్యాడ్‌ సిరీస్‌లో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ నటించారు. ఆయ్‌ కూడా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే.