
ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రాణించి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. వారిలో అనికా సురేంద్రన్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అనికా సురేంద్రన్ తమిళ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. నటి అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది. దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ సినిమాలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

ఆతర్వాత విశ్వసం అనే సినిమాలో మరోసారి మెప్పించింది. ఈ సినిమాలో కూడా అజిత్ కు కూతురిగా నటించింది. ఈ సినిమాలో అజిత్, నయనతార కూతురిగా కనిపించింది.. దాంతో అభిమానులు ఆమెను కుట్టి నయన్ అని పిలుచుకోవడం ప్రారంభించారు.

ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. 18 ఏళ్లకు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. నటుడు హిప్హాప్ ఆది నటించిన తమిళ చిత్రం పిడి సర్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.

ఆతర్వాత ధనుష్ దర్శకత్వంలో రూపొందిన జాబిలమ్మ నీకు అంతకోపమ సినిమాలో అనికా సురేంద్రన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.