Yatra 2: యాత్ర 2లో వన్ సైడ్ గేమ్.. రాజకీయం రగులుతోందా ??

| Edited By: Phani CH

Feb 04, 2024 | 9:16 PM

మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో పొలిటికల్ సినిమాల హవా కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే యాత్ర 2 మరో వారం రోజుల్లోనే వచ్చేస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మరి యాత్ర 2 ట్రైలర్ ఎలా ఉంది..? యాత్ర మాదిరే ఎవర్ని నొప్పించకుండా ఉంటుందా లేదంటే ప్రతిపక్షాలతో గిల్లికజ్జాలుంటాయా..? పొలిటికల్ సీజన్ నడుస్తున్న సమయంలో యాత్ర 2 సినిమా మరింత హీట్ పెంచేస్తుంది. ముఖ్యంగా 5 ఏళ్ళ కింద వచ్చిన యాత్ర మంచి విజయం సాధించడంతో.. సీక్వెల్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

1 / 5
మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో పొలిటికల్ సినిమాల హవా కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే యాత్ర 2 మరో వారం రోజుల్లోనే వచ్చేస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మరి యాత్ర 2 ట్రైలర్ ఎలా ఉంది..? యాత్ర మాదిరే ఎవర్ని నొప్పించకుండా ఉంటుందా లేదంటే ప్రతిపక్షాలతో గిల్లికజ్జాలుంటాయా..?

2 / 5
పొలిటికల్ సీజన్ నడుస్తున్న సమయంలో యాత్ర 2 సినిమా మరింత హీట్ పెంచేస్తుంది. ముఖ్యంగా 5 ఏళ్ళ కింద వచ్చిన యాత్ర మంచి విజయం సాధించడంతో.. సీక్వెల్‌పై ఆసక్తి పెరిగిపోయింది. అప్పటి యాత్రలో YSR జర్నీ చూపించిన దర్శకుడు మహి వి రాఘవ్.. యాత్ర 2లో జగన్ యాత్రను చూపిస్తున్నారు. వైఎస్ చనిపోయాక ఏర్పడ్డా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది.

3 / 5
మరికొన్ని రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు వస్తుండటంతో యాత్ర 2పై అంచనాలు బాగానే ఉన్నాయి.. ఫిబ్రవరి 8న ఈ సినిమా వస్తుంది. అందరికీ తెలిసిన కథే ఇది.. కాకపోతే జగన్ కోణంలోనే సాగుతుంది. చూస్తుంటే యాత్ర 2పై రాజకీయ దుమారం రేగేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే యాత్రలో YSR ఛరిష్మాను మాత్రమే చూపించిన మహి.. యాత్ర 2లో మాత్రం రాజకీయ వ్యంగ్యాస్త్రాలు కూడా బాగానే వేసారు.

4 / 5
ట్రైలర్‌ను రాజశేఖర్ రెడ్డి పాత్రతోనే మొదలుపెట్టి.. ఆ తర్వాత జగన్‌ను సీన్‌లోకి తీసుకొచ్చారు. యాత్ర మాదిరే దీన్ని కూడా ఎమోషనల్‌గా చెప్పాలనే ప్రయత్నం ట్రైలర్‌తోనే చేసారు మహి వి రాఘవ్.

5 / 5
ఇందులో జగన్‌గా జీవా నటిస్తుంటే.. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కంటిన్యూ అయ్యారు. ట్రైలర్‌లో కాంగ్రెస్ ప్రస్తావన నేరుగానే తీసుకొచ్చారు మేకర్స్. మొత్తానికి చూడాలిక.. యాత్ర 2 ఏపీలో ఎలాంటి రాజకీయ వేడి రాజేస్తుందో..?