Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ మెగా ఫార్ములా వర్కవుటయ్యేనా.. కుర్రాడు గాడిన పడ్డట్లేనా ??

| Edited By: Phani CH

Nov 21, 2023 | 8:03 PM

వైష్ణవ్ తేజ్.. మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో. ముందు ఈ కుర్రాడిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అసలు వస్తున్నట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. కానీ అదేంటో మెగా హీరోలలోనే ఏదో తెలియని అయస్కాంతం ఉంటుంది. అది వైష్ణవ్ తేజ్‌లోనూ ఉన్నట్లుంది. అందుకే ఎలాంటి సందడి లేకుండా వచ్చి ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు మెగా మేనల్లుడు. ఆ సినమా ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. హైయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన డెబ్యూ హీరోగా ఇండియన్ సినిమాలోనే నెంబర్ వన్‌గా నిలిచాడు వైష్ణవ్ తేజ్. అయితే ఉప్పెన తర్వాత మరో సక్సెస్ కోసం చూస్తూనే ఉన్నాడు ఈ కుర్ర హీరో.

1 / 6
వైష్ణవ్ తేజ్.. మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో. ముందు ఈ కుర్రాడిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అసలు వస్తున్నట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. కానీ అదేంటో మెగా హీరోలలోనే ఏదో తెలియని అయస్కాంతం ఉంటుంది. అది వైష్ణవ్ తేజ్‌లోనూ ఉన్నట్లుంది. అందుకే ఎలాంటి సందడి లేకుండా వచ్చి ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు మెగా మేనల్లుడు.

2 / 6
ఆ సినమా ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. హైయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన డెబ్యూ హీరోగా ఇండియన్ సినిమాలోనే నెంబర్ వన్‌గా నిలిచాడు వైష్ణవ్ తేజ్. అయితే ఉప్పెన తర్వాత మరో సక్సెస్ కోసం చూస్తూనే ఉన్నాడు ఈ కుర్ర హీరో. తర్వాత రెండు సినిమాలు చేసినా.. వర్కవుట్ అవ్వలేదు. అసలు మెగా కుటుంబం నుంచి హీరోలు అంటే ఆడియన్స్ ముందుగా కోరుకునేది కమర్షియల్ సినిమాలే.

3 / 6
ఉప్పెన పూర్తిగా డిఫెరెంట్ సినిమా.. ట్విస్ట్ వర్కవుట్ అయింది కాబట్టి బొమ్మ బ్లాక్‌బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత క్రిష్‌తో కొండపొలం లాంటి భిన్నమైన సినిమా చేసాడు వైష్ణవ్ తేజ్. కరోనా టైమ్‌లో వచ్చిన ఈ చిత్రం అస్సలు వర్కవుట్ కాలేదు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన మూడో సినిమా రంగరంగ వైభవంగా పరిస్దితి కూడా అంతే. అప్పటికే ఎన్నోసార్లు వాడి పారేసిన మూస ఫార్ములాతో వచ్చిన ఈ చిత్రం.. వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. దాంతో మంచి మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న వైష్ణవ్ తేజ్ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి.

4 / 6
రంగరంగ వైభవంగా తర్వాత భారీగానే గ్యాప్ తీసుకున్నాడు వైష్ణవ్. చాలా రోజుల తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా ఆదికేశవ. ఇన్నాళ్లకు మెగా హీరోను అనే సంగతి గుర్తుకొచ్చినట్లుంది.. అందుకే తమకు అనుకూలమైన మాస్ జోనర్‌లోకి వచ్చేసాడు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

5 / 6
మరోవైపు తాజాగా విడుదలైన ట్రైలర్ చూసాక.. సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. కొత్తదనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు.. పక్కాగా కొత్త సీసాలో పాత సారా పోసి అమ్ముతున్నాం అని క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. రాయలసీమ నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ సినిమా ఇది. ట్రైలర్ కూడా ముందు ఓ నిమిషం పాటు కుటుంబం, ప్రేమ, కామెడీని చూపించిన దర్శకుడు.. ఆ తర్వాత నిమిషం అంతా యాక్షన్‌కు ఇచ్చేసాడు. రేపు సినిమా కూడా ఇదే ఫార్మాట్‌లో వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

6 / 6
ముందు కాసేపు లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించి.. ఆ తర్వాత యాక్షన్ వైపు వెళ్తుంది కథ. కచ్చితంగా ఆదికేశవతో తన మార్కెట్ పెరుగుతుందని నమ్ముతున్నాడు వైష్ణవ్ తేజ్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఫార్చున్ ఫోర్ బ్యానర్‌పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చూడాలిక.. ఆదికేశవతో వైష్ణవ్ తేజ్ కోరుకుంటున్న ఇమేజ్ వస్తుందో లేదో..? ఒకవేళ సినిమా వర్కవుట్ అయితే మాత్రం కచ్చితంగా కలెక్షన్ల వర్షం ఖాయం.