
బాహుబలి సినిమా పూర్తయ్యీ కాగానే కరణ్‌జోహార్ తో డార్లింగ్ సినిమా ఉంటుందనే ప్రచారం అప్పట్లో వీరలెవల్లో జరిగింది. ప్రభాస్ రెమ్యునరేషన్ 30 కోట్లు అడిగారని, కరణ్ అంత ఇవ్వనన్నారని... ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే మాటలు కూడా వైరల్ అయ్యాయి.

అయితే అందులో ఏమాత్రం నిజం లేదని ఓ సందర్భంలో కొట్టిపడేశారు ప్రభాస్. కరణ్ మీద తనకు మంచి గౌరవం ఉంటుందని అన్నారు. ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ కాలేదనీ చెప్పారు. రెండోసారి కరణ్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు డార్లింగ్... సాహోతో బిజీ.

సాహోకే తొమ్మిది నెలలు పడుతుందని, ఇంకోసారి చూద్దామని.. కరణ్‌కి, నో చెప్పేశారట ప్రభాస్. అలా మిర్చిలాంటి కుర్రాడితో సినిమా చేద్దామనుకున్న కరణ్ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి. లేటెస్ట్ గా ఇప్పుడు మళ్లీ ... కరణ్, దేవర హీరోతో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కరణ్ జోహార్, అనిల్ తడానీ. దేవర తర్వాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో తారక్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం జోరందుకుంది.

దేవర2, వార్2, ప్రశాంత్ నీల్ సినిమా అంటూ వరుస లైనప్‌తో బిజీగా ఉన్న తారక్... కరణ్‌కి ఎప్పుడు డేట్లిస్తారు? అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే తారక్ తోనైనా కరణ్ ఛాన్స్ దొరుకుతుందేమో చూడాలి.