Chhaava: కాంట్రవర్సీలో శివాజీ వారసుడి సినిమా.. ఛావాపై రేగిన వివాదమేంటి..?

Updated on: Feb 08, 2025 | 8:15 AM

ఈ రోజుల్లో కథల్లేని సినిమాలైనా వస్తున్నాయేమో గానీ కాంట్రవర్సీలు లేని సినిమాలు మాత్రం రావట్లేదు. మరీ ముఖ్యంగా హిస్టరీని టచ్ చేసారంటే చాలు.. చరిత్ర కారులు కూడా రెడీగా ఉంటారు అందులో తప్పులెతకడానికి. తాజాగా ఛావా సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. మరి శివాజీ వారసుడి సినిమాపై రేగిన వివాదమేంటి..?

1 / 5
ట్రైలర్ విడుదలైన రోజు నుంచే ట్రెండింగ్‌లో ఉంది ఛావా సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఇది. తండ్రి మరణానంతరం మరాఠి సామ్రాజ్యంలో శంభాజీ చేసిన వీరోచిత పోరాటం, ఎంతో స్ఫూర్తినిచ్చింది తర్వాతి తరాలకు.

2 / 5
అలాంటి కథతో వస్తున్నారు కాబట్టి.. ముందుగానే చిత్రయూనిట్‌ను చరిత్రకారులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. మరి ఛావాపై ఎలాంటి వివాదాలు వస్తున్నాయి.? ఇప్పుడు మనం ఇందులో తెలుసుకుందాం..

3 / 5
ట్రైలర్‌లో శంభాజీ, ఆయన సతీమణి యేసుబాయ్ లెజిమ్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్లు, డాన్స్ చేసినట్టు చూపించారని.. క్రియేటివ్ లిబర్టీ పేరుతో జరగనివి చూపిస్తే లేనిపోని వివాదాలు వస్తాయని ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌కు ఇప్పటికే కొన్ని సూచనలు అందుతున్నాయి.

4 / 5
వాటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు మేకర్స్. మరోవైపు ఛావా సినిమాలో ముఘల్ చక్రవర్తి  ఔరంగజేబు పాత్రను చాలా నెగిటివ్‌గా చూపించారనే వాదన మరో వర్గం నుంచి వస్తుంది. 

5 / 5
దాంతో విడుదలకు ముందు ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే చరిత్రకారలకు స్పెషల్ షో వేయాల్సిందే అంటున్నారు. మరి దీనికి ఛావా మేకర్స్ ఓకే అంటారా..? గతంలోనూ పద్మావత్, జోధా అక్బర్ సహా చాలా చారిత్రాత్మక సినిమాలకు వివాదాలు తప్పలేదు.