
జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా..? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారీయన.

మణిరత్నంతో కమిటైన థగ్ లైఫ్‌పై ఫోకస్ చేసారు లోకనాయకుడు.1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. పొన్నియన్ సెల్వన్‌తో ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. థగ్ లైఫ్‌తో రప్ఫాడించాలని చూస్తున్నారు.

భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ హాసన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయిప్పుడు. జూన్ 5న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో శింబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే.

థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత కూడా కమల్ బిజీగానే ఉండబోతున్నారు. ఇప్పటికే ఇండియన్ 3 ఉంటుందని ప్రకటించారు శంకర్. అలాగే విశ్వరూపం 3 కూడా చేయాలని చూస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్.

ఇందులో ఇండియన్ 3 షూట్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది.. విశ్వరూపం 3 ఇప్పుడు మొదలు కానుంది.. అలాగే విక్రమ్ 2 కూడా లైన్‌లోనే ఉంది. మొత్తానికి మరో రెండు మూడేళ్ళు కమల్ సీక్వెల్స్‌తోనే బిజీ అన్నమాట.