
టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది

ఫిబ్రవరి 26న జరిగిన రష్మిక- విజయ్ ల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఈ క్రమంలో తాజాగా బుధవారం (మార్చి 4న) రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు నవ దంపతులు. పలువరు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా విజయ్ పెద రాయుడు గెటప్ లో అదరగొట్టాడు. తెల్ల పంచె, భుజంపై కండువాతో సరికొత్త లుక్ లో కనిపించాడీ రౌడీ హీరో

ఇక రష్మిక మందన్నా కూడా రెడ్ కలర్ శారీలో కలర్ ఫుల్ గా కనిపించింది. ప్రస్తుతం విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, శ్రీకాంత్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్ - రష్మికల రిసెప్షన్ కు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు.