Sreeleela: పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం అందుకే శ్రీలీలను తీసుకున్నారా..? అసలు విషయం ఇది..

| Edited By: Rajeev Rayala

Nov 14, 2024 | 4:07 PM

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. గత వారం రోజులుగా పుష్ప 2 స్పెషల్ సాంగ్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా ఇదే విషయంపై మరో క్రేజీ న్యూస్ వైరలవుతుంది.

1 / 5
2021లో భారీ అంచనాల మధ్య విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా పుష్ప ది రైజ్. ఇందులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. భారీ వసూళ్లు రాబట్టింది.

2 / 5
లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే సినిమాలు కాస్త పలచనవడంతో ఇలా పొటో షూట్ల మీద పడ్డారని అంటున్నవారూ లేకపోలేదు. ఎవరేమనుకుంటే మనకేంటి.. డిసెంబర్‌ 5న కిస్సిక్‌ సాంగ్‌ చాలు..

3 / 5
ఊ అంటావా మావ పాట తర్వాత ఇప్పుడు మరోసారి పుష్ప 2లోనూ స్పెషల్ సాంగ్ ఉండడంతో మరింత బజ్ ఏర్పడింది. మొదటి నుంచి ఈ పాటలో కనిపించే ముద్దుగుమ్మ ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. చివరకు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల సెలక్ట్ అయ్యింది.

4 / 5
అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ ముందుగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వద్దకు వెళ్లిందట. అయితే కిస్సింగ్ సాంగ్ కోసం బీటౌన్ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పుష్ప 2 స్పెషల్ పాటలో శ్రద్ధాను చూడాలనుకున్న మేకర్స్ కు నిరాశే ఎదురయ్యింది.

5 / 5
దీంతో ఆమె కాకుండా కిస్సింగ్ సాంగ్ కోసం శ్రీలీలను ఎంపిక చేశారట డైరెక్టర్ సుకుమార్.