Vithika Sheru: మహాలక్ష్మిగా ముస్తాబైన వితికా షేరు.. ఈ నిండు చందమామను చూసేందుకు రెండు కళ్లు చాలవే..
2008లో ఓ కన్నడ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రేమించే రోజుల్లో మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఈ జంట పాల్గొన్నారు. తమదైన ఆట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు.