Vishal: తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండి రెడ్ కార్డ్ జారీ చేయడం గురించి విశాల్ స్పందించారు. పనీపాటా లేకుండా ఖాళీగా కూర్చున్నవాళ్లే ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పారు. తనకు అవగాహన ఉన్నంత మేరకు రెడ్ కార్డు ఫుట్‌బాల్ క్రీడలో ఇస్తారని, సినిమాల్లో కాదని అన్నారు. సినిమాలు తీస్తూ బిజీగా ఉండేవారికి ఇలాంటి ఆలోచనలు రావని తెలిపారు.
Nikhil Siddhartha: కొడుకు పుట్టిన తర్వాత జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు హీరో నిఖిల్. అబ్బాయి పేరు ధీర సిద్ధార్థ్ అని పెట్టామని చెప్పారు. తను పుట్టినప్పటి నుంచి ఏమాత్రం సమయం ఉన్నా, తనకే కేటాయిస్తున్నానని అన్నారు. పిల్లాడి బాధ్యతను పంచుకోవడానికి తనవంతు ప్రయత్నిస్తున్నానని చెప్పారు నిఖిల్.
Mr. Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా టీమ్ అయోధ్య రామ్ మందిరాన్ని సందర్శించింది. అక్కడి వీడియో షేర్ చేశారు మేకర్స్. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఉత్తరాదిన జరిగిన కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే హైదరాబాద్‌లో కలుస్తామని అన్నారు హరీష్ శంకర్.
The Raja Saab: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజా సాబ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా అప్‌డేట్స్ ఇప్పుడే చెప్పబోమని అన్నారు నిర్మాత. కల్కి సినిమా విడుదలయ్యాక రాజా సాబ్ డీటైల్స్ రివీల్ చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది రాజాసాబ్.
Darling: సోషల్ మీడియాలో నభానటేష్‌కీ, ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది. హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు రిప్లై ఇస్తూ ఆమెను డార్లింగ్ అని అన్నారు ప్రియదర్శి. అమ్మాయిలను ఇలా అనడం నేరం అంటూ కోప్పడ్డారు నభా. డార్లింగ్ సినిమా ప్రమోషన్ల కోసం వీరిద్దరూ నెట్టింట్లో ఇలా మాట్లాడుకున్నారన్నది కొసమెరుపు.