Vikram: నయా రూట్లో ట్రావెల్ చేస్తున్న విక్రమ్.. ఇప్పటికైనా ప్రేక్షకులకు దగ్గరయ్యేనా

Edited By:

Updated on: Jun 03, 2025 | 7:30 PM

దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఎవరైనా మొండిగా ఎందుకుంటారు? ఎక్కడో ఆగి ఆలోచిస్తారు కదా... విక్రమ్‌ విషయంలోనూ ఇదే జరిగినట్టుంది. రకరకాల ప్రయోగాలు చేసి రియాలిటీకి దూరంగా ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులు పట్టించుకోరనే విషయాన్ని అర్థం చేసుకున్నట్టున్నారు చియాన్‌... అందుకే రూట్‌ మార్చి జనాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

1 / 5
సినిమాల్లో నటనకు స్కోప్‌ ఉంది.... ఫిజికల్‌ ట్రాన్స్ ఫర్మేషన్‌కి స్కోప్‌ ఉంది. పీరియాడిక్‌ మూవీలో ఫలానా కేరక్టర్‌ ఉంది.. అని ఏ డైరక్టర్‌కి అనిపించినా సరే, ముందు గుర్తుకొచ్చే పేరు విక్రమ్‌. ఒప్పుకున్న రోల్‌ ఎంత టఫ్‌గా ఉంటే, అంత ఎంజాయ్‌ చేసి మూవీ కంప్లీట్‌ చేస్తారు విక్రమ్‌.

2 / 5
అంత కష్టపడి చేసిన సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటే, కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నట్టున్నారు చియాన్‌. పడే కష్టమేదో రైట్‌ డైరక్షన్‌లో పడితే పోతుందిగా అని అనుకున్నట్టున్నారు. ఇప్పుడు చియాన్‌ లైనప్‌ చూసిన వారందరూ ఇదే భావిస్తున్నారు.

3 / 5
వీరధీరశూరన్‌ కూడా యాక్షన్‌ సినిమానే. కాకపోతే, చియాన్‌ని ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఎక్కువగా కనెక్ట్ చేసింది. విక్రమ్‌ సినిమాల మీద జనాలకు విసుగొచ్చిన సమయంలో రిలీజ్‌ అయింది వీరధీరశూరన్‌. ఇలాంటి ప్రాజెక్టులు చేస్తే మేం ఎందుకు ఆదరించం.. అంటూ కాసులు కురిపించారు ఫ్యాన్స్.

4 / 5
ఓ వైపు వీరధీరశూరన్‌ ఫస్ట్ పార్టు చేస్తూనే, ఇంకో వైపు  96, సత్యం సుందరం లాంటి ఎమోషనల్ మూవీస్‌ను రూపొందించిన ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు చియాన్‌.

5 / 5
ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా 2026లో సెట్స్ మీదకు వెళ్లనుంది. సెన్సిటివ్‌ సబ్జెక్టులని డీల్‌ చేసే ప్రేమ్‌కుమార్‌.. విక్రమ్‌ని ఎలా చూపిస్తారోనని ఇంట్రస్టింగ్‌గా వెయిట్‌ చేస్తున్నారు అభిమానులు.