Samantha: హాట్ టాపిక్ గా మారిన సమంత.. ఫిలిం సర్కిల్స్‌లో సంథింగ్.. సంథింగ్..
ప్రజెంట్ సింగిల్ స్టేటస్‌లో ఉన్న సామ్, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. రెగ్యులర్‌గా ఒకే వ్యక్తితో కలిసి కెమెరాల కంట పడుతుండటంతో వాళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్.
Updated on: Jun 03, 2025 | 7:38 PM

కొద్ది రోజులుగా సమంత ఎక్కడ కనిపించినా దర్శకుడు రాజ్ నిడమోరు కూడా ఆమె పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా సమంత నిర్మాతగా మారి శుభం సినిమా తెరకెక్కిచటం మొదలు పెట్టిన తరువాత ఇద్దరు రెగ్యులర్‌గా కెమెరాల కంటపడుతున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సమంత సోషల్ మీడియా పోస్ట్‌లలోనూ రాజ్ కనిపించటం. ఈ వార్తలపై ఇద్దరూ స్పందించకపోవటంతో నిజమేనేమో అన్న కంక్లూజన్‌కు వచ్చేస్తున్నారు ఫ్యాన్స్. సమంత కీలక పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్‌లకు వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజ్.

శుభం సినిమా నిర్మాణం విషయంలో సమంతకు ఆయన సపోర్ట్‌గా నిలబడ్డారు. ఆ తరువాత ప్రమోషన్స్‌లోనూ ఆమెతోనే కలిసి ఉన్నారు. ఆ పరిచయమే ఇప్పుడు ప్రేమగా మారిందన్నది ఆన్‌లైన్ ఆడియన్స్ చేస్తున్న కామెంట్.

సామ్ - రాజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా.. తన సోషల్ మీడియా పోస్ట్‌లతో రాజ్ భార్య శ్యామాలి... వాళ్ల రిలేషన్‌ను కన్ఫార్మ్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్. ఆ మధ్య తన ఇన్‌స్టా స్టోరీలో 'నా గురంచి ఆలోచిస్తున్న వాళ్లకు, వింటున్న వాళ్లకు, నా కోసం మాట్లాడుతున్న వాళ్లకు కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు శ్యామాలి... ఆ పోస్ట్ వైరల్ కావటంతో ఇది రాజ్ - సమంత రిలేషన్ గురించే అన్న చర్చ జరిగింది.

తాజాగా మరోపోస్ట్ చేశారు శ్యామాలి 'కాలం అన్నింటినీ బయట పెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది. ఈ లోకం దీనిని జాగ్రత్తగా చూస్తుంటుంది' అనే కోట్‌ను తన ఇన్‌స్టా స్టోరిలో షేర్ చేశారు. రాజ్‌తో కలిసి గేమ్ ఆడుతున్న పోస్ట్ సమంత షేర్ చేసిన తరువాత శ్యామాలి ఈ పోస్ట్ చేయటం మరింత ఆసక్తికరంగా మారింది.




