
సుజీత 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో టీఎస్ మణి, రాధ దంపతులకు జన్మించింది. సుజీత ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి.

ప్రముఖ చిత్రనిర్మాత ధనుష్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు చెన్నైలో నివసిస్తున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించింది. హీరో అబ్బాస్ సినిమాలో కనిపించినప్పుడు సుజీత వయసు కేవలం 41 రోజులు. తర్వాత కే.ఆర్ విజయ మనవరాలిగా కనిపించింది.

మలయాళ సిరీస్ 'స్వాంతం మలూట్టీ'లో మొట్టమొదటిసారిగా ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది.

మారుతని సీరియల్ ద్వారా సుజీతకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులోని మీనాచి అనే పాత్రలో నటించింది.

చివరిసారిగా దియా, కణం అనే సినిమాల్లో కనిపించింది సుజీత. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న 'వదినమ్మ' సీరియల్లో సీత పాత్రలో లీడ్ రోల్ పోషిస్తుంది.