
ఎన్నికల హీట్ పెరిగిన తర్వాత రోజూ వార్తల్లో ఉంటారు పవన్ కల్యాణ్ అనుకున్నారు అందరూ. అయితే అంతకన్నా ముందే హీట్ పెంచుతున్నారు పవర్‌స్టార్. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాల నుంచి రోజుకో వార్త జనాలను ఊరిస్తోంది.

అందులోనూ ఓజీకి సంబంధించిన చిన్న విషయం కూడా కాక రేపుతోంది. ఈ మధ్య వరుసగా రీమేక్ సినిమాలే చేశారు పవర్‌స్టార్. పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్, మలయాళ సూపర్‌హిట్ సినిమా అయ్యప్పనుం కోషియుం సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయక్ చేశారు.

ఈ మధ్య మేనల్లుడితో కలిసి చేసిన బ్రో సినిమా కూడా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సిత్తమ్ ఆధారంగా తెరకెక్కించిందే. బ్రో సినిమా రిలీజ్ ముందు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆఫ్టర్ రిలీజ్ అనుకున్నంతగా క్యాష్ చేసుకోలేకపోయింది.

ఓజీ సినిమాకు రోజు రోజులకీ క్రేజ్ పెరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ దాదాపు 23 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. నెవర్ బిఫోర్ ఫిగర్ అని అంటున్నారు క్రిటిక్స్. ప్రస్తుతం ఫారిన్‌లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు పవన్.

హిట్టూ ఫ్లాపులను పక్కనపెట్టి రీమేకుల నుంచి దూరం జరిగారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ఒరిజినల్ స్టోరీతో రూపొందుతున్న ఓజీలో తనకిష్టమైన రోల్ చేస్తున్నారు ఈ మెగా తమ్ముడు.త్వరలోనే థాయ్‌ల్యాండ్‌లో ఓజీ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారన్నది టాక్. తిరిగి వచ్చాక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు పవర్ స్టార్.