5 / 5
హీరోలంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టే స్టార్ డైరెక్టర్లకు కూడా ఎదురు చూపులు తప్పట్లేదు. బోయపాటికి నిర్మాత ఉన్నా.. హీరో లేడు. మరోవైపు త్రివిక్రమ్ పరిస్థితి అంతే. ఈయన కథ రాసుకున్నా.. అందులో నటించేందుకు హీరోలెవరూ ఖాళీగా లేరు. శ్రీకాంత్ ఓదెల, హను రాఘవపూడి, వంశీ పైడిపల్లి.. ఇలా చాలా మంది దర్శకులు ఇప్పుడు హీరోల కోసం వేచి చూస్తున్నారు.