
అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై చాలా సినిమాల్లో నటించి, ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా మౌనరాగం సీరియల్‌తో తెలగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు చాలా సీరియల్స్‌లోనే నటించింది. ముఖ్యంగా జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సీరియల్‌తో తన నటనతో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఇక ఈ సీరియల్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది.

దీంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి, తన ఆటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కానీ చివరి వరకు ఉండలేకపోయింది. ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ షోలు, సీరియల్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఈ అమ్మడు మౌనరాగం సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి వీరు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఇంత వరకు వారు పెళ్లి ముచ్చట గురించి స్పందించలేదు. కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, వారిద్దరు కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ లవ్ బర్డ్స్ , చాలా ఆనందంగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. గాలి పటాలను ఎగరవేస్తూ.. చాలా క్యూట్‌గా ఉన్న ఫొటోస్ ప్రియాంక తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇక వీటిని చూసిన వారందరూ.. పండుగ అంటే ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.