
నిత్యం తన గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట సెగలు పుటిస్తోంది ఈ బ్యూట. సీరియల్లలో చీరకట్టులో ఎంతో పద్దతిగా, హుందాతనంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మోడ్రన్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరు అనుకుంటున్నారు.

తను మరెవరో కాదు.. జగతి మేడమ్.. అలియాస్ జ్యోతి పూర్వజ్. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందులో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది.

కొన్నాళ్లుగా నెట్టింట రచ్చ చేస్తుంది జ్యోతి. ఆమె ఫ్యాషన్, స్టైల్, న్యూట్రాలిటీ ప్రతీ ఫోటోలో కనిపిస్తుంది. ఎమ్ర్బేసింగ్ ది గోల్డెన్ అవర్ అంటూ క్యాప్షన్ ఇస్తూ జ్యోతి పూర్వజ్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తుంది.

ఆమె బ్యాక్ డ్రాప్ లో ఆకాశం.. సిటీ లైట్స్ ఆమె అందాన్ని మరింత హైలెట్ చేస్తున్నారు. సూర్యస్తమయం కాంతుల్లో క్రేజీ ఫోజులతో కవ్విస్తోంది జ్యోతి పూర్వజ్. మొదట్లో కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

తెలుగు సీరియల్ గుప్పెడంత మనసులోని ఆమె నటించిన తల్లి పాత్రకు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. పెళ్లి తర్వాత తన పేరును జ్యోతి పూర్వజ్ గా మార్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.