ప్రస్తుతానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. పర్సనల్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యే తమిళనాడులోని గుడులన్నీ తిరిగిన ఈ బ్యూటీ.. ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బయటికి వస్తున్న ఫోటోలు, వీడియోలు సమంత ఉన్న పరిస్థితిని చూపిస్తున్నాయి. తాజాగా ఈమె పూర్తిగా మేకోవర్ అయిపోయారు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు స్యామ్.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి షూటింగ్ వేగంగా జరుగుతుంది. పవన్ లేని సీన్లు కంప్లీట్ చేస్తున్నారు సుజిత్. పవన్ లేకపోయినా.. ఆయన ముందున్నట్లుగా ఆర్టిస్టుల ఎక్స్‌ప్రెషన్స్ కూడా ముందుగానే క్యాప్చర్ చేస్తున్నారు సుజీత్. జులై చివరి నాటికి పవన్ లేని సన్నివేశాలన్నింటినీ పూర్తి చేయాలని చూస్తున్నారు సుజీత్. ఆగస్ట్‌లో పవన్ వచ్చాక.. 15 రోజుల్లో మొత్తం షూట్ పూర్తి చేయాలనేది సుజీత్ ప్లాన్.
పి వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా చంద్రముఖి 2. 18 ఏళ్ళ కింద వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ఇది. గణేష్ చతుర్థి సందర్భంగా విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు రీ రికార్డింగ్ మొదలు పెట్టారు కీరవాణి. కచ్చితంగా ఈ సినిమా భయపెడుతూ నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తుందని ట్వీట్ చేసారు కీరవాణి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషీ. లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈచిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్‌పై అప్‌డేట్ వచ్చింది. ఆగస్ట్ 31 రాత్రి ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ఖుషీని శ్లోక ఎంటర్‌టైన్మెంట్స్ అక్కడ విడుదల చేయనుంది.
రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బికినీ ట్రీట్ ఇచ్చారు. వరస సినిమాలు చేస్తూనే.. అప్పుడప్పుడూ ఖాళీ సమయాల్లో వెకేషన్‌కు వెళ్తుంటారు ఈ బ్యూటీ. తాజాగా దుబాయ్‌లో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రకుల్.. అక్కడ బీచ్‌లో బికినీతో మతులు పోగొడుతున్నారు. తన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్ చేస్తూనే ఉన్నారు రకుల్. తాజాగా ఇవి వైరల్ అవుతున్నాయి.