
టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

అయితే ఇప్పుడు సురేఖా వాణి కూతురు సుప్రిత నాయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందీ స్టార్ కిడ్

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న సుప్రిత సిల్వర్ స్క్రీన్ పై ఎలా సత్తా చాటుతుందో చూడాలి.

సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగాప్రముఖ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుంది సుప్రీత. తల్లితో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేసింది.

తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుప్రిత. ఇందులో చీరకట్టులో చాలా ట్రెడిషినల్ గా కనిపించిందీ స్టార్ కిడ్.