
భారతీయ సినిమా రంగం మీద ఓ బయోపిక్ రూపొందుతోంది. దీనికి ఎస్ ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ సినిమా పుట్టుక, విస్తరణ గురించి ఈ బయోపిక్ ఉంటుంది. కథ విన్న వెంటనే భావోద్వేగానికి గురయినట్టు తెలిపారు రాజమౌళి. త్వరలోనే నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెల్లడిస్తామని అన్నారు.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లడంతో షూటింగ్‌కి కాస్త గ్యాప్ వచ్చింది. రేపటి నుంచి దేవర సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారట. ఈ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులందరూ పాల్గొంటారు.

నేషనల్ అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్నారు అల్లు అర్జున్. ఆయన అభిమానులు మరో శుభవార్తను వైరల్ చేస్తున్నారు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. దీనికోసం బన్నీ త్వరలోనే లండన్ వెళ్తారనే వార్త వైరల్ అవుతోంది.

టైగర్ ష్రాఫ్, కృతిసనన్ నటిస్తున్న సినిమా గణ్‌పత్. ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మరోసారి అఫిషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు మేకర్స్. టైగర్ ష్రాఫ్ లుక్స్ చూస్తే భారీ యాక్షన్ సినిమా అని అర్థమవుతోందని అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్.

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్. అక్టోబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రం పోస్టర్ ఆకట్టుకుంటోంది. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్నాయి. ఎ మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ మహా క్రియేట్ ప్రొడ్యూసర్.