- Telugu News Photo Gallery Cinema photos Tollywood senior heroines samantha to keerthy suresh and rakul preet singh starts glamour show for movie offers Telugu Actress Photos
Tollywood Senior Heroines: గ్లామర్ షోలో తగ్గేదే లే అంటున్న సీనియర్ హీరోయిన్లు.!
సీనియర్లు అయిపోయారు.. అవకాశాలు తగ్గిపోయాయి.. కుర్ర హీరోయిన్లు వచ్చారు.. ఇంక వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారేమో..? మేం గ్లామర్ షో చేయడం మొదలుపెడితే.. మాతో పోటీ ఎవరూ పడలేరు.. మా షోకు మతులు పోతాయంటే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వీళ్లంతా కట్టగట్టుకుని మరీ ఈ మధ్య రెచ్చిపోతున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది.
Updated on: Feb 21, 2024 | 10:43 PM

సీనియర్లు అయిపోయారు.. అవకాశాలు తగ్గిపోయాయి.. కుర్ర హీరోయిన్లు వచ్చారు.. ఇంక వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారేమో..? మేం గ్లామర్ షో చేయడం మొదలుపెడితే.. మాతో పోటీ ఎవరూ పడలేరు.. మా షోకు మతులు పోతాయంటే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వీళ్లంతా కట్టగట్టుకుని మరీ ఈ మధ్య రెచ్చిపోతున్నారు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది. వీళ్లు రేసులో ముందున్నా.. మీతో పోటీలో మేమూ ఉన్నామని ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు.

రకుల్ ప్రీత్ సింగ్‌నే తీసుకోండి.. వారంలో పెళ్ళి పెట్టుకుని.. అదిరిపోయే హాట్ ఫోటోషూట్ చేసారు ఈ బ్యూటీ. ఇదిప్పుడు వైరల్ అయి కూర్చుంది.

శృతి హాసన్, తమన్నా ఐతే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాలతో విందు ఇస్తూనే ఉంటారు ఈ బ్యూటీస్.

సమంత కూడా తక్కువేం తినట్లేదు. మయోసైటిస్ నుంచి మెల్లగా బయట పడుతున్న స్యామ్.. తన రీ ఎంట్రీని ఘనంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు.

టిల్లు స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ పుట్టించిన సెగలు ఇంకా చల్లారడం లేదు. ఆ స్థాయిలో రెచ్చిపోయారు ఈ బ్యూటీ. నయనతార సైతం జవాన్ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కోసం బానే రెచ్చిపోతున్నారు.

ఎలా చూసినా.. కుర్ర హీరోయిన్లకు తమ నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుందని ఈ గ్లామర్ షోతో చెప్తూనే ఉన్నారు సీనియర్ ముద్దుగుమ్మలు.




