యంగ్ హీరోల జోరు మాములుగా లేదు..భారీ చిత్రాలతో కుర్ర హీరోలు!
2024 సంవత్సరంలో అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే మాలీవుడ్‌లోనే ఎక్కువ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే... మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళ సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టాయి. వసూళ్ల విషయంలోనే కాదు, విశ్లేషకుల ప్రశంసల విషయంలోనూ మాలీవుడే ముందు స్థానంలో దూసుకెళ్తోంది.
Updated on: Jan 19, 2025 | 8:06 PM

తెలుగు సినిమా స్థాయి పెరగటంతో హీరోల మార్కెట్‌తో సంబంధం లేకుండా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గత అనుభవాలను పట్టించుకోకుండా పాన్ ఇండియా మూవీస్ లైన్‌లో పెట్టేస్తున్నారు. 2025లో భారీగా చిత్రాలతో బరిలో దిగుతున్న కుర్ర హీరోల లిస్ట్ గట్టిగా కనిపిస్తోంది.

హనుమాన్ సినిమాతో గత ఏడాది సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజ సజ్జ, 2025లోనూ మరో బిగ్ హిట్ మీద కన్నేశారు. మరోసారి సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది.

కార్తికేయ సిరీస్‌తో నేషనల్ లెవల్‌లో సక్సెస్ అందుకున్న నిఖిల్ అదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. స్పై మూవీ నిరాశపరిచినా... నెక్ట్స్ పాన్ ఇండియా మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలతో నార్త్ మార్కెట్‌లో మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు.

నార్త్‌లో సత్తా చాటేందుకు కష్టపడుతున్న అడివి శేష్ 2025 మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. గూఢాచారి సీక్వెల్‌గా రూపొందుతున్న జీ2తో నార్త్ మార్కెట్‌లో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు.

లాంగ్ బ్రేక్ తరువాత డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టుతో నేషనల్ లెవల్‌లో ప్రూవ్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

Tollywood4