పోలీసులకు, పొలిటీషియన్లకు మధ్య చోటుచేసుకునే ఘటనల ఆధారంగా తెరకెక్కింది కోట బొమ్మాళి పీయస్ సినిమా. ఎన్నికల సీజన్‌లో పోలీసులకున్న ఒత్తిడి, రాజకీయనాయకులకుండే టెన్షన్లు, ఇలా అన్ని వైపుల నుంచి విషయాలను తీసుకుని కోట బొమ్మాళి పీయస్‌ని తెరకెక్కించారు మేకర్స్. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ నటనకు ఫిదా అవుతున్నారు ఆడియన్స్. లింగి లింగి లింగిడి పాట హోరెత్తుతోంది.