హీరోయిన్లకు జయాపజయాలు వర్తించవా ?? సినీ వర్గాలు ఏమంటున్నాయంటే

Edited By: Phani CH

Updated on: Feb 18, 2025 | 8:07 PM

సినిమా హిట్‌ ఫ్లాప్‌తో హీరోయిన్లకు సంబంధం ఉంటుందా? ఉండదా? అసలే గ్లామర్‌ కొరతతో ఇండస్ట్రీ అల్లల్లాడిపోతుంటే, ఉన్న వారి మీద కూడా ఈ లేని పోని మాటలెందుకు? అని అంటున్నారా? తప్పదండీ.. మంచీ చెడూ అన్నీ మాట్లాడుకోవడమేగా ఫిల్మ్ నగర్‌ పని. ఇంతకీ భాగ్యశ్రీ, పూజా హెగ్డే, కృతి శెట్టి గురించి జంక్షన్‌లో ఏం టాక్స్ నడుస్తున్నాయి?

1 / 5

పూజా హెగ్డే గురించి ఈ మధ్య ఎవరిని అడిగినా.. ఆమె కెరీర్‌ సాగుతుందో, ఆగుతుందో ఈ ఇయర్‌ డిసైడ్‌ చేసేస్తుందని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ అరవింద బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ చూసి కూడా చాన్నాళ్లయింది.

2 / 5
మరి ఇన్నాళ్ల తర్వాత ఆమెను ఆదుకోవాల్సిన బరువును భుజానికెత్తుకున్నారు సూర్య. ఈ సమ్మర్‌లో రిలీజ్‌ అయ్యే రెట్రో హిట్‌ అయితేనే, పూజా హెగ్డేకి ఫ్యూచర్‌. లేకుంటే, చేతిలో ఉన్న ఒకటీ అరా సినిమాలతో బ్యాగ్‌ సర్దుకోవాల్సిందే.

3 / 5
పూజా హెగ్డేకి మాత్రమే కాదు, తమిళంలో భాగ్యశ్రీకి కూడా ఛాన్స్ ఇస్తున్నారు సూర్య. నడిప్పిన్‌ నాయగన్‌ సినిమాలో భాగ్యశ్రీ అనేది ఇప్పుడు హాట్‌ న్యూస్‌. ఫస్ట్ మూవీ మిస్టర్‌ బచ్చన్‌ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టినా కూడా భాగ్యశ్రీకి వస్తున్న అవకాశాలకు ఇబ్బందేమీ లేదు. యంగ్‌ హీరోల క్రేజీ ప్రాజెక్టులకు ఫస్ట్ ఛాయిస్‌ గా కనిపిస్తున్నారు భాగ్యశ్రీ.

4 / 5
ఇదే విషయం కృతి శెట్టికి కూడా వర్తిస్తుంది. ఉప్పెనతో నాన్‌స్టాప్‌ అవకాశాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి వరుసగా సినిమాలొచ్చాయి. అయితే హిట్లు మాత్రమే కరువయ్యాయి. ఆ  మధ్య టొవినోతో చేసిన మలయాళం మూవీ క్లిక్‌ అయింది.

5 / 5
ప్రస్తుతం అమ్మణికి ఒకటీ అరా తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్‌ నుంచి కూడా ఛాన్సులు వస్తున్నాయి. సో, గత సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా, మళ్లీ మళ్లీ ఛాన్సులివ్వడానికి ఇండస్ట్రీ రెడీ. కాకపోతే, వాటిని నిలబెట్టుకుంటే లాంగ్‌ కెరీర్‌ ఉంటుంది. లేకుంటే, స్పీడ్‌ బ్రేకర్‌ని సొంతంగా వేసుకున్నట్టే అంటున్నారు క్రిటిక్స్.