
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత టాలీవుడ్‌కు మరో బ్లాక్‌బస్టర్ రావడానికి చాలా టైమ్ పట్టింది. మధ్యలో తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించినా.. వాటి మధ్య చాలా గ్యాప్ ఉంది.

సమ్మర్‌లో పెద్ద సినిమాలు కూడా పెద్దగా రాలేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ను ఆదుకుంటుంది మే నెల. హిట్ 3 లాంటి బ్యాంగ్‌తో ఈ నెల మొదలైంది. నాని హీరోగా వచ్చిన హిట్ 3 ఇప్పటికే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.. ఇంకా ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి.

అలాగే మే 9న విడుదలైన #సింగిల్ సినిమాకి ఖతర్నాక్ కలెక్షన్స్ వస్తున్నాయి. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం 2 రోజుల్లోనే 80 శాతం బిజినెస్ రికవరీ చేసింది. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకుంటుంది.. అలాగే సమంత శుభం సినిమా ఓ వర్గాన్ని ఆకట్టుకుంటుంది.

కొత్త సినిమాలే కాదు.. జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి రీ రిలీజ్ సినిమాకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. తొలిరోజే ఈ సినిమాకు 1.75 కోట్లు వచ్చాయి. వీకెండ్ వరకు జగదేకవీరుడి హవా కనిపించడం ఖాయం.

ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపిఎల్ ఆగిపోవడం ఈ సినిమాలకు కలిసొచ్చింది. మొత్తానికి వచ్చీ రావడంతోనే టాలీవుడ్‌కు మంచి రోజులు తీసుకొచ్చింది మే. మరి ఇది కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి.